చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం | toddler kidanped in hyderabad | Sakshi
Sakshi News home page

చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

Dec 14 2016 10:32 AM | Updated on Sep 4 2017 10:44 PM

చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

మేడ్చల్లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమయింది.

మేడ్చల్: మేడ్చల్లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమయింది. కిడ్నాపర్లు తూప్రాన్‌లో వదిలి వెళ్లటంతో ఆమెను ఓ వ్యక్తి చేరదీసి పోలీసులకు అప్పగించాడు. మేడ్చల్ ఉమా వెంకట్రామిరెడ్డి నగర్‌కు చెందిన శ్రీనివాస్, శైలజ దంపతులకు కూతురు దీక్షిత (ఏడాదిన్నర) ఉంది. మంగళవారం సాయంత్రం పక్కింట్లో అద్దెకు ఉండే చుట్టూతల శివ, లక్ష్మి దంపతులు దీక్షితను తీసుకుని మార్కెట్‌కు అంటూ బయలుదేరి వెళ్లారు.
 
వారు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి శ్రీనివాస్ కుటుంబసభ్యులు అంతటా వెదికారు. ఫలితం లేకపోవటంతో బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో కిడ్నాపర్లు చిన్నారిని తూప్రాన్లో వదిలేసి వెళ్లిపోయారు. చిన్నారిని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. వారి సూచన మేరకు మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి దీక్షితను అప్పగించాడు. చివరికి చిన్నారి తల్లిదండ్రుల చెంతకు చేరింది.

 

Advertisement
 
Advertisement
Advertisement