breaking news
deekshitha
-
డెంగీతో ఐఐటీ విద్యార్థిని మృతి
వనపర్తి, అమరచింత: పట్టణానికి చెందిన దీక్షిత (18) ఐఐటీ విద్యార్థిని డెంగీ జ్వరంతో కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందింది. మండలంలోని చంద్రనాయక్ తండాకు చెందిన సీత్యానాయక్ కూతురు దీక్షిత ఐఐటీలో ఆల్ఇండియా 241వ ర్యాంకును సాధించి వారణాసిలో ఐఐటీ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి సీత్యానాయక్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడ్డారు. స్వగ్రామమైన చంద్రనాయక్ తండాకు విద్యార్థిని దీక్షిత మృతదేహంను తీసుకువచ్చి ఖననం చేశారు. (రానున్న రోజుల్లో పొంచి ఉన్న వ్యాధుల ముప్పు..) -
చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
మేడ్చల్: మేడ్చల్‌లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమయింది. కిడ్నాపర్లు తూప్రాన్‌లో వదిలి వెళ్లటంతో ఆమెను ఓ వ్యక్తి చేరదీసి పోలీసులకు అప్పగించాడు. మేడ్చల్ ఉమా వెంకట్రామిరెడ్డి నగర్‌కు చెందిన శ్రీనివాస్, శైలజ దంపతులకు కూతురు దీక్షిత (ఏడాదిన్నర) ఉంది. మంగళవారం సాయంత్రం పక్కింట్లో అద్దెకు ఉండే చుట్టూతల శివ, లక్ష్మి దంపతులు దీక్షితను తీసుకుని మార్కెట్‌కు అంటూ బయలుదేరి వెళ్లారు. వారు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి శ్రీనివాస్ కుటుంబసభ్యులు అంతటా వెదికారు. ఫలితం లేకపోవటంతో బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో కిడ్నాపర్లు చిన్నారిని తూప్రాన్‌లో వదిలేసి వెళ్లిపోయారు. చిన్నారిని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. వారి సూచన మేరకు మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి దీక్షితను అప్పగించాడు. చివరికి చిన్నారి తల్లిదండ్రుల చెంతకు చేరింది.