నేడు ఆరోగ్యశాఖలో బదిలీల కౌన్సెలింగ్‌ | today transfer councelling in health department | Sakshi
Sakshi News home page

నేడు ఆరోగ్యశాఖలో బదిలీల కౌన్సెలింగ్‌

Jun 2 2017 7:57 PM | Updated on Jun 1 2018 8:39 PM

వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల కౌన్సెలింగ్‌ శనివారం ఉదయం 10 గంటలకు చేపట్టనున్నారు.

అనంతపురం మెడికల్‌ : వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల కౌన్సెలింగ్‌ శనివారం ఉదయం 10 గంటలకు చేపట్టనున్నారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయ మీటింగ్‌ హాల్‌లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీహెచ్‌ఏ, ఎల్‌డీ కంప్యూటర్, ఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూ, ఫార్మసిస్టులు, ఆఫీస్‌ సబార్డినేట్, ల్యాబ్‌ టెక్నీషియన్, డ్రైవర్స్, ఎంఎన్‌ఓలు, ఎఫ్‌ఎన్‌ఓలు, స్వీపర్లు, వాచ్‌మన్లు తదితర కేడర్ల ఉద్యోగులకు కౌన్సెలింగ్‌ ఉంటుంది. కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జేసీ–2 ఖాజామొహిద్దీన్‌ రానున్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రమేశ్‌నాథ్‌ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ జరుగుతుంది. అన్ని కేడర్లకు సంబంధించి బదిలీలకు 295 మంది అర్హులున్నట్లు అధికారులు తేల్చారు.

Advertisement
 
Advertisement
Advertisement