నేడు హాకీ జిల్లా జట్ల ఎంపిక | today hockey team selections | Sakshi
Sakshi News home page

నేడు హాకీ జిల్లా జట్ల ఎంపిక

Aug 28 2016 10:49 PM | Updated on Sep 4 2017 11:19 AM

వరంగల్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొనడానికి జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్‌ ఔట్‌ డోర్‌ స్టేడియంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా జట్ల ఎంపిక కార్యక్రమం ఉంటుందని హాకీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఎండీ ఇమామ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

 నల్లగొండ టూటౌన్‌ : వరంగల్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొనడానికి జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్‌ ఔట్‌ డోర్‌ స్టేడియంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా జట్ల ఎంపిక కార్యక్రమం ఉంటుందని హాకీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఎండీ ఇమామ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలకు సెప్టెంబర్‌ 2 నుంచి 4వ వరకు, బాలురకు సెప్టెంబర్‌ 16 నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయన్నారు. 18 సంవత్సరాల లోపు బాల బాలికలు ఆధార్‌ కార్డు, వయసు దృవీకరణ పత్రాలతో ఎంపికలకు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు 9490061616 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement