నేడు జిల్లాలో సీఎం పర్యటన | today cm tour in mukthapuram | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాలో సీఎం పర్యటన

Jul 4 2017 10:42 PM | Updated on Jul 28 2018 3:15 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు.

అనంతపురం అర్బన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీని పురస్కరించుకుని నిర్వహిస్తున్న రైతు కృతజ్ఞతా యాత్రలో ఆయన పాల్గొంటారు. ఉదయం 10.40 గంటలకు కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామం చేరుకుని అక్కడ హౌసింగ్‌ కాలనీని ప్రారంభిస్తారు. అనంతరం మొక్కలు నాటి కాలనీలో కల్పించిన వసతులను పరిశీలిస్తారు. లబ్ధిదారులతో మాట్లాడతారు. ఉదయం 11.15 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. మధ్యాహ్నం 1.15 నుంచి 1.45 వరకు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 1.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పుట్టపర్తి విమానాశ్రయానికి.. ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement