భారత్ సంచార్ నిగాం లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) బుధవారం మెగా మేళా నిర్వహించనుందని జిల్లా టెలికాం సీనియర్ జనరల్ మేనేజర్ తెలిపారు.
నేడు బీఎస్‌ఎన్‌ఎల్ మెగా మేళా
Aug 9 2016 8:10 PM | Updated on Sep 4 2017 8:34 AM
డాబాగార్డెన్స్: భారత్ సంచార్ నిగాం లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) బుధవారం మెగా మేళా నిర్వహించనుందని జిల్లా టెలికాం సీనియర్ జనరల్ మేనేజర్ తెలిపారు. విశాఖ జిల్లా పరిధిలోని సీతమ్మధార, మధురవాడ, ఎంవీపీ కాలనీ, భీమిలి, మల్కాపురం, బాలచెఱువు, గాజువాక, అక్కయ్యపాలెం, డాబాగార్డెన్స్, సీఆర్‌ఆర్, వెలంపేట, ఇండస్ట్రీయల్ ఎస్టేట్, మాధవధార, ఎన్‌ఏడీ, చోడవరం, గోపాలపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచలి, పాడేరు, అరకు ప్రాంతాల్లో మెగామేళా నిర్వహించనున్నట్టు చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్ నిర్వహించనున్న మెగామేళాలో పాల్గొనే వినియోగదారులు పాస్‌ఫొటో, గుర్తింపు కార్డును తీసుకురావాలని సూచించారు. బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు టోల్‌ఫ్రీ నెంబరులో 1800 180 1503 సంప్రదించవచ్చు.
Advertisement
Advertisement