దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
నల్లగొండ టూటౌన్ : ఎన్డీయే ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు కార్మికులకు పిలుపునిచ్చారు.
నల్లగొండ టూటౌన్ : ఎన్డీయే ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మగ్దూం భవన్‌లో జరిగిన ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, ఎన్. సతీష్, ఎండి. ఇమ్రాన్, ఎండి. నయీద్, జడ శ్రీనివాస్, ఎస్‌కె. లత్తు, నాగార్జున, శ్రీను, అంజనీ కుమార్, రవి, కాశయ్య, మురళి, స్వామినాయక్, రాఘవరెడ్డి, వెంకరమణ, తదితరులున్నారు.