అందరికీ వసతి కల్పించాలని ఆందోళన | To provide accommodation for all concerned | Sakshi
Sakshi News home page

అందరికీ వసతి కల్పించాలని ఆందోళన

Aug 4 2016 1:29 AM | Updated on Apr 3 2019 8:07 PM

అందరికీ వసతి కల్పించాలని ఆందోళన - Sakshi

అందరికీ వసతి కల్పించాలని ఆందోళన

విద్యార్థులందరికీ హాస్టల్‌ వసతి కల్పించాలని ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు బుధవారం నాయకులు విద్యార్థులతో కలిసి ఎస్కేయూలో నిరసన తెలిపారు.

ఎస్కేయూ: విద్యార్థులందరికీ హాస్టల్‌ వసతి కల్పించాలని ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు బుధవారం  నాయకులు విద్యార్థులతో కలిసి ఎస్కేయూలో నిరసన తెలిపారు. ఆధునికీకరణ పనులు పూర్తి కాకుండానే హాస్టల్స్‌ పునఃప్రారంభిస్తున్నట్లు నిర్ణయం ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. మెస్‌ బిల్లులు పూర్తీగా చెల్లించలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నార ని, కేవలం 10 శాతం మాత్రమే ఇపుడు చెల్లించేలా వెసులుబాటు కల్పించాలని డిమాండ్‌ చేశారు. తక్కిన మొత్తాలు తరువాత కట్టేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు క్రాంతి కిరణ్, జయ చంద్రారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పులిరాజు, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు వెంకటేశులు, శ్రీధర్‌ గౌడ్, సుబ్బరాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement