పశువులను తరలించే వారిపై చర్య తీసుకోవాలి | To move the animals to take action against them | Sakshi
Sakshi News home page

పశువులను తరలించే వారిపై చర్య తీసుకోవాలి

Jul 28 2016 2:12 AM | Updated on Sep 4 2017 6:35 AM

పరిమితికి మించి వాహనాల్లో గేదెలు, గోవులను కబేళాలకు తరలిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాని కోరుతూ బీజేవైఎం, బీజేపీ ఆద్వర్యంలో బుధవారం మిర్యాలగూడలో డీఏఓ ప్రమీలకు వినతిపత్రం అందజేశారు.

మిర్యాలగూడ : పరిమితికి మించి వాహనాల్లో గేదెలు, గోవులను కబేళాలకు తరలిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాని కోరుతూ బీజేవైఎం, బీజేపీ ఆద్వర్యంలో బుధవారం మిర్యాలగూడలో డీఏఓ ప్రమీలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు రేపాల పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ సామర్థ్యపు సర్టిఫికెట్‌ ప్రకారం పెద్దలారీలో ఆరు, చిన్నలారీలో నాలుగు మాత్రమే తరలించేలా చూడాలన్నారు. వినతిపత్రం అం దించిన వారిలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు సైదులు, పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుపల్లి చంద్రమౌళి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బంటు గిరి, కమలాకర్‌రెడ్డి, చిలుకూరి శ్యామ్, నక్క రవి, నక్కశ్రీను, బాబు, మహేష్, ధనుంజయ్, సంపత్‌ ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement