బహిరంగ సభకు భద్రతా ఏర్పాట్లు.. | Tight security arrangements made for TRS public meet : CP Sudheer Babu | Sakshi
Sakshi News home page

బహిరంగ సభకు భద్రతా ఏర్పాట్లు..

Apr 25 2017 7:50 PM | Updated on Sep 5 2017 9:40 AM

బహిరంగ సభకు భద్రతా ఏర్పాట్లు..

బహిరంగ సభకు భద్రతా ఏర్పాట్లు..

బహిరంగ సభకు భద్రతా పరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు.

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు భద్రతా పరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. ఆరు వేల మంది పోలీసు సిబ్బందితో బహిరంగ సభ కోసం విధులు నిర్వహిస్తారని తెలిపారు.

మంగళవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, దాదాపు 25 లక్షల మేరకు ప్రజలు హాజరయ్యే అవకాశాలు ఉన్నందున పార్కింగ్, ట్రాఫిక్ వంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని చోట్లా పికెటింగ్ నిర్వహిస్తూ పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు జారీ చేస్తామని చెప్పారు. సభకు హాజరయ్యే వారి వాహనాలను పార్క్ చేసుకోవడానికి వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే సభకు వెళ్లడానికి 21 రహదారులను ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement