పత్తికొండ మండలంలోని హోసూరు, కోతిరాళ్ల గ్రామాల్లో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నం
Dec 11 2016 9:59 PM | Updated on Nov 6 2018 7:56 PM
పత్తికొండ టౌన్: పత్తికొండ మండలంలోని హోసూరు, కోతిరాళ్ల గ్రామాల్లో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కోతిరాళ్ల గ్రామానికి చెందిన గుంటూరు రైతు శ్రీనివాసరావు కుమార్తె అనంతలక్ష్మి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమికచికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థిని పత్తికొండ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో సెకండియర్ చదువుతోంది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
- హోసూరు గ్రామానికి చెందిన రంగస్వామి కుమార్తె గాయత్రి ఇంట్లో గొడవపడి క్షణికావేశానికి లోనై రసాయన ద్రావణాన్ని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు కర్నూలుకు తరలించారు.అదే గ్రామానికి చెందిన చిన్నహుల్తి గొల్ల చిన్నఅంజినయ్య(61) ఇంట్లో గొడవపడి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలుకు తరలించారు.
Advertisement
Advertisement