ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి | three dies after drown in well in kurnool district | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

Sep 20 2015 6:43 PM | Updated on Sep 3 2017 9:41 AM

ముగ్గురు యువకులు ఆదివారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు.

కర్నూలు: బేతంచర్ల మండలం గోరుమాన్‌కొండకు చెందిన ముగ్గురు యువకులు ఆదివారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. గ్రామ సమీపంలోని మైనింగ్ గుంటల్లో ఈతకొట్టడానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కిషోర్(20), సురేందర్(16), సాయిసుబ్రహ్మణ్యం(16) అనే ముగ్గురు యువకులు మరణించారు. గ్రామస్తులు గుంట నుంచి మృతదేహాలను వెలికితీశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement