'వారికి రాజ్యాంగ ఫలాలు దక్కటం లేదు' | They do not deserve the benefits of the Constitution | Sakshi
Sakshi News home page

'వారికి రాజ్యాంగ ఫలాలు దక్కటం లేదు'

Aug 14 2016 7:20 PM | Updated on Sep 4 2018 5:21 PM

స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా నేటికి వికలాంగులకు రాజ్యాంగ ఫలాలు దక్కటం లేదని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రం
స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా నేటికి వికలాంగులకు రాజ్యాంగ ఫలాలు దక్కటం లేదని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు.పోరాటాల ద్వారానే తమ హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.

 

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ వికలాంగులను సమాజంలో చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ర్టంలో 3 లక్షల మంది వికలాంగ పిల్లలుంటే వారు చదువుకోవటానికి కేవలం 7 పాఠశాలలే ఉండటం బాదాకరం అన్నారు.వికలాంగుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూడకుండా వారికి తగిన సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

విద్యార్ధుల సంఖ్యకు అనుగుంగా పాఠశాలలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. వికలాంగులకు అనేక చట్టాలు ఉన్నప్పటికి ఎందుకు అమలు కావటం లేదని ఆయన ప్రశ్నించారు.ప్లోరైడ్‌ను నిర్మూలించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ వేదిక గౌరవ అధ్యక్షులు యం.జనార్ధన్ రెడ్డి, అధ్యక్షులు గోరెంకల నర్సింహా, ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య, మహిళా కన్వీనర్ వరమ్మ, రామకష్ణ, ఆర్.వెంకటేశ్, గణేష్, ఖాజా, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement