నామాపూర్‌లో నాలుగు ఇళ్లలో చోరీ | theft in four houeses | Sakshi
Sakshi News home page

నామాపూర్‌లో నాలుగు ఇళ్లలో చోరీ

Aug 12 2016 9:56 PM | Updated on Sep 4 2017 9:00 AM

ముస్తాబాద్‌ మండలంలోని నామాపూర్‌లో గురువారం రాత్రి దొంగలు నాలుగు ఇళ్లలో చోరికి పాల్పడ్డారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

  • రూ. 76 వేల నగదు, ఏడు తులాల బంగారం అపహరణ
  • ముస్తాబాద్‌ : మండలంలోని నామాపూర్‌లో గురువారం రాత్రి దొంగలు నాలుగు ఇళ్లలో చోరికి పాల్పడ్డారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఏఎసై ్స రాజిరెడ్డి, బాధితుల కథనం ప్రకారం.. నామాపూర్‌కు చెందిన తాడెపు రవి కుమారుడికి ముస్తాబాద్‌ ఆస్పత్రిలో ఆపరేషన్‌ జరగగా ఇంటికి తాళం వేసి వెళ్లారు. దొంగలు రవి ఇంటిలో దూరి బీరువాలో ఆపరేషన్‌ కోసం దాచిన రూ.70 వేల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.  పొన్నం రామచందర్‌రెడ్డి ఇంటికి తాళం వేసి కుటుంబీకులతో బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లోనూ దొంగలు పడ్డారు. బీరువాలోని మూడు తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. అక్కడి నుంచి మేర్గు అంజాగౌడ్‌ ఇంట్లోకి వెళ్లి బీరువాలోని రూ.6 వేల నగదు, తులం బంగారు గొలుసు, 20 తులాల వెండి గాజులు అపహరించారు. మేర్గు రామచంద్రం ఇంట్లోనూ చోరీ చేశారు. అయితే వారు లేకపోవడంతో వివరాలు తెలియాల్సి ఉంది. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో.. ఏఎసై ్స రాజిరెడ్డి నామాపూర్‌కు వెళ్లి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. కరీంనగర్‌ నుంచి క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎసై ్స తెలిపారు.  


     

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement