భీమవరం టౌ¯ŒS : రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.1.27 లక్షల విలువ చేసే 37 గ్రాముల బంగారం, నాలుగు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్టు భీమవరం రైల్వే ఎస్‌ఐ జి.ప్రభాకరరావు తెలిపారు. రైల్వే పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరులకు ఆయన కేసు వివరాలు వెల్లడి ంచారు.
చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్
Nov 27 2016 1:49 AM | Updated on Aug 20 2018 4:27 PM
భీమవరం టౌ¯ŒS : రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.1.27 లక్షల విలువ చేసే 37 గ్రాముల బంగారం, నాలుగు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్టు భీమవరం రైల్వే ఎస్‌ఐ జి.ప్రభాకరరావు తెలిపారు. రైల్వే పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరులకు ఆయన కేసు వివరాలు వెల్లడి ంచారు. ఆయన కథనం ప్రకారం.. వీరవాసరం మండలానికి చెందిన మోగంటి సాయిచంద్ 2011 నుంచి రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. రాజమండ్రి, తాడేపల్లిగూడెం, భీమవరం రైల్వే పరిధిలో ఇతనిపై కేసులు ఉన్నాయి. గతంలో అరెస్టయి ఆరు నెలలపాటు జైల్లో ఉన్నాడు. గత జూ¯ŒSలో విడుదలయ్యాడు. ఆ తరువాత మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడు. సర్కార్, శేషాద్రి, ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లు, మచిలీపట్నం ప్యాసిం జర్ రైళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. శుక్రవారం తణుకు రైల్వే స్టేష¯ŒS శివారుల్లో సాయిచంద్ ఉన్నట్టు గుర్తించి సిబ్బందితో వెళ్లగా పారిపోయేందుకు యత్నించాడు. చాకచక్యంగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ రైల్వే కోర్టుకు తరలించారు. నిందితుడిని పట్టుకునేందుకు హెడ్ కానిస్టేబుళ్లు ఎం.ప్రసాదబాబు, బి.రమణ (భీమవరం), వెంకన్నబాబు (తాడేపల్లిగూడెం), కానిస్టేబుల్ రమేష్‌కుమార్, శ్రీను, సూరి బాబు, రామచంద్ర, లచ్చన్న సహకరించారు.
Advertisement
Advertisement