రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య | The suicide of a man who fell under a train | Sakshi
Sakshi News home page

రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య

Nov 29 2016 1:37 AM | Updated on Nov 6 2018 7:56 PM

స్థానిక హనుమాన్ సర్కిల్‌ రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

గుంతకల్లు: స్థానిక హనుమాన్ సర్కిల్‌ రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాంగ్‌మెన్ సమాచారంతో జీఆర్‌పీ పోసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉండవచ్చని, చామన ఛాయ రంగు కల్గి ఉన్నాడని,  గ్రీన్ కలర్‌ లైన్ చొక్కా, బూడిద రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. చేతిపై పచ్చబొట్టుతో చరణ్‌ అను పేరు ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement