చోరీకి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి | The person who stole dehasuddhi | Sakshi
Sakshi News home page

చోరీకి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి

Jul 25 2016 9:03 PM | Updated on Sep 4 2017 6:14 AM

చోరీకి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి

చోరీకి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి

ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన మండలంలోని కొమురవెల్లిలో సోమవారం చోటుచేసుకుంది.

  • పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
  • చేర్యాల : ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన మండలంలోని కొమురవెల్లిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ... మహారాష్ట్రలోని భువనపటాకు చెందిన పరమానంద్‌ అనే వ్యక్తి కొమురవెల్లిలోని బత్తిని నర్సింహులు అనే చిరు వ్యాపారి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. నర్సింహులు కుటుంబసభ్యులు తాళం వేసి పొలానికి వెళ్లగా పరమానంద్‌ ఇంట్లోకి చొరబడి కిరాణా షాపులోని చిల్లర సరుకులు, గల్లాపెట్టెలోని నగదు తీసుకున్నాడు. ఈ విషయం గమనించిన పొరుగువారు నర్సింహులుకు సమాచారం అందించారు. నర్సింహులు ఇంటికి రాగానే అతడితో పాటు స్థానికులు పరమానంద్‌ను స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వద్ద ఎలాంటి ఐడీ అడ్రసులు లేవు, అతడు కూడా గంటకో పేరు చెపుతూ, హిందీలో మాట్లాడుతూ పిచ్చిగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులకు సైతం అర్థం కాలేదు. నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement