నమ్మి గదిని అద్దెకు ఇచ్చిన ఇంటి యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ దివాకర్ కథనం ప్రకారం.. పాలకుర్తి మండలం పెద్ద తండాకు చెందిన గుగులోతు శ్రీనాథ్ ఖానాపురం మండలంలోని ఐనపల్లిలో విజేత ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు.
ఇంటి యజమానికి విద్యార్థి టోకరా
Sep 23 2016 12:46 AM | Updated on Nov 9 2018 5:02 PM
నర్సంపేట : నమ్మి గదిని అద్దెకు ఇచ్చిన ఇంటి యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ దివాకర్ కథనం ప్రకారం.. పాలకుర్తి మండలం పెద్ద తండాకు చెందిన గుగులోతు శ్రీనాథ్ ఖానాపురం మండలంలోని ఐనపల్లిలో విజేత ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు.
నర్సంపేట పట్టణంలోని టీఆర్‌ఎస్ కాలనీలో ఆకారపు కుమారస్వామి ఇంట్లోని గదిలో అద్దెకు ఉంటూ కళాశాలకు వెళ్లొస్తున్నాడు. కొద్దిరోజులు గా జల్సాలు, వ్యసనాలకు అలవాటుపడిన శ్రీనాథ్ ఆగస్టు 30న కుమారస్వామి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి బంగారు అభరణాలను ఎత్తుకెళ్లాడు. సాయంత్రం ఇంటి కి వచ్చిన కుమారస్వామి, కుటుంబ సభ్యులు ఇంట్లో చిందరవందరగా పడేసిన దుస్తులు, సామగ్రిని చూసి ఆందోళనకు గురై ఆభరణాలు చూసుకోగా అపహరణకు గురైనట్లు గుర్తించా రు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనాథ్‌ను రిమాం డ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశం లో ఎస్సైలు ఇ.హరికృష్ణ, హెడ్‌కానిస్టేబుళ్లు సదానందం, మల్లేశం పాల్గొన్నారు.
Advertisement
Advertisement