ఆకు పచ్చ నగరంగా తీర్చిదిద్దాలి: మంత్రి జగదీశ్వర్ రెడ్డి | The Hyderabad change Should change in to green city | Sakshi
Sakshi News home page

ఆకు పచ్చ నగరంగా తీర్చిదిద్దాలి: మంత్రి జగదీశ్వర్ రెడ్డి

Jul 31 2016 7:07 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఆకుపచ్చ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కషి చేయాలని రాష్ట్ర మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు.

ఆకుపచ్చ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కషి చేయాలని రాష్ట్ర మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. సైదాబాద్ డివిజన్ శ్రీశ్రీశ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో ఆదివారం ఆయన మొక్కలు నాటారు. సిని నటులు, ప్రముఖ కమెడియన్ వేణుమాదవ్ కూడ మొక్కలు నాటారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. కాలుష్య కాసారంగా మారిన నగరంలో స్వచ్ఛమైన గాలి కోసం దూర ప్రాంతాలకు పోవల్సి వస్తుందన్నారు. కాంక్రిట్ జంగిల్‌గా మారిన నగరంలో ఆకాశ మార్గంలో బహుళ అంతస్థులు దర్శనం ఇస్తున్నా చెట్లు వెతికినా కనిపించడం లేదన్నారు. ఇలాగే ఉంటే భవిష్యత్‌లో చెట్లు అనేవి లేకుండ పోయే ప్రమాదం ఉందని తెలిపారు. మనకు కాకపోయిన భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మొక్కలు నాటడంతో సరిపెట్టకుండ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కోరారు.

 

అప్పుడే హరితహారానికి ఫలితం ఉంటుందని అన్నారు. ఎవరికి మొక్కలు కావాలన్న దగ్గర్లోని ఉద్యనవణానికి వెళ్లాలని సూచించారు. ఎన్ని మొక్కలైన పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంకల్పానికి ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ప్రాణంతో సమానంగా మొక్కలు పెంచాలని కమెడియన్ వేణుమాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతశ్రీనివాస్‌రెడ్డి, ఆలయ ఉపాధ్యక్షులు యాదగిరిగౌడ్, డాక్టర్ అశోక్‌శర్మ, అల్లి శ్రావణ్‌కుమార్, బోషెట్టి కష్ణ, ప్రతాప్‌రెడ్డి, రవిశంకర్, సోమయ్య, హరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement