మానుకోట అభివృద్ధికి కృషి | The development effort to give | Sakshi
Sakshi News home page

మానుకోట అభివృద్ధికి కృషి

Aug 23 2016 12:33 AM | Updated on Sep 4 2017 10:24 AM

మానుకోట అభివృద్ధికి కృషి

మానుకోట అభివృద్ధికి కృషి

మానుకోట జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్‌ రాంచంద్రునాయక్‌ అన్నారు.

  • 2 మండలాలకు కేంద్రంగా మహబూబాబాద్‌
  • ఇల్లెందునూ కలిపేందుకు ప్రయత్నిస్తాం
  • ఎంపీ అజ్మీర సీతారామ్‌ నాయక్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి రాంచంద్రునాయక్‌
  • పట్టణంలో భారీ ర్యాలీ 
  • మహబూబాబాద్‌ : మానుకోట జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్‌ రాంచంద్రునాయక్‌ అన్నారు. 12 మండలాలతో మానుకోట జిల్లా కేంద్రంగా ఉంటుందని చెప్పారు. మానుకోట జిల్లా ఏర్పాటు ఖాయమని తేలడంతో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పట్టణంలో సోమవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వివేకానంద సెంటర్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గిరిజన ప్రజలు అత్యధికంగా ఉన్న మానుకోట జిల్లాపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు.  ఇల్లందు మండలాన్ని కూడా మహబూబాబాద్‌లో కలిపేలా చూస్తానన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు  కృషిచేస్తానన్నారు. రాంచంద్రునాయక్‌ మాట్లాడుతూ.. 27 జిల్లాల్లో మానుకోటను మొదటి స్థానంలో ఉంచేలా కృషి చేస్తానని అన్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఎలాంటి మార్పు ఉండదని, ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ జిల్లా ఏర్పాటుతో మానుకోట అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. జిల్లా కోసం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ వినోద్‌కుమార్, కలెక్టర్‌ వాకాటి కరుణ, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, శంకర్‌నాయక్‌ ఎంతో కృషి చేశారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ మానుకోట ప్రజలు కేసీఆర్‌కు ఎంతగానో రుణపడి ఉంటారని అన్నారు. మానుకోటలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఎంపీ సీతారాంనాయక్, ఢిల్లీలో అధికార ప్రతినిధి రామచంద్రునాయక్‌ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సత్యవతి రాథోడ్, రాజవర్ధన్‌రెడ్డి, మార్నేని వెంకన్న, పాల్వాయి రాంమ్మోహన్‌రెడ్డి, డాక్టర్‌ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement