దేశ పారిశ్రామిక రంగం పనితీరు జోరు అక్టోబర్‌లో నిదానించింది. 13 నెలల కనిష్ట స్థాయిలో 0.4 శాతంగా నమోదైంది. విద్యుత్, మైనింగ్, తయారీ రంగాల్లో పనితీరు మందగించింది.
పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 2024 అక్టోబర్‌లో 3.7 శాతం వృద్ధిని చూడడం గమనార్హం.
ఈ ఏడాది సెప్టెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటును గతంలో ప్రకటించిన 4 శాతం నుంచి 4.6శాతానికి సవరిస్తున్నట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) ప్రకటించింది.
పారిశ్రామికోత్పత్తిలో భాగమైన తయారీరంగం అక్టోబర్‌లో 1.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2024 అక్టోబర్‌లో వృద్ధి 4.4 శాతం కంటే తక్కువ.
మైనింగ్ రంగంలో ఉత్పత్తి 1.8 శాతం తగ్గింది. క్రితం ఏడాది అక్టోబర్‌లో 0.9 శాతం వృద్ధి చెందింది.
విద్యుదుత్పత్తి సైతం 6.9% తగ్గింది. క్రితం ఏడా ది ఇదే నెలలో 2% వృద్ధిని చూడడం గమనార్హం.
క్యాపిటల్ గూడ్స్‌లో ఉత్పత్తి 2.4 శాతం పెరిగింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో ఉత్పత్తి 0.5 శాతం తగ్గింది. క్రితం ఏడాది ఇదే నెలలో 5.5 శాతం వృద్ధి చెందడం గమనించొచ్చు.
కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్‌లో ఉత్పత్తి 4.4 శాతం తగ్గింది.
ఇన్‌ఫ్రా/కన్‌స్ట్రక్షన్ గూడ్స్‌లో 7.1 శాతం వృద్ధి నమోదైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు దేశ పారిశ్రామికోత్పత్తి వృద్ధి 2.7 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 4 శాతంగా ఉంది.


