మహిళ దారుణ హత్య | The brutal murder of woman | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

May 24 2016 1:25 PM | Updated on Sep 4 2017 12:50 AM

కొనకనమిట్ల మండలం వద్దిమడుగు గ్రామంలో ఆళ్లచెరువు అనురాధ(40) అనే మహిళ దారుణ హత్యకు గురైంది.

కొనకనమిట్ల మండలం వద్దిమడుగు గ్రామంలో ఆళ్లచెరువు అనురాధ(40) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన బద్రి గురుమూర్తి అనే వ్యక్తే గొంతు పిసికి చంపి ఉంటాడని అనురాధ తండ్రి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

 

ఆమె 15 ఏళ్లుగా భర్తతో విడిగా ఉంటోంది. గురుమూర్తి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి గురుమూర్తే మంగళవారం వేకువజామున గొంతు పిసికి చంపి ఉంటాడని భావిస్తున్నారు. ఉదయం తండ్రి చూసేసరికి అనురాధ నిర్జీవంగా పడి ఉంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement