గుట్కా తయారీ కేంద్రంపై దాడి.. | the attack on Quaid manufacturing factory | Sakshi
Sakshi News home page

గుట్కా తయారీ కేంద్రంపై దాడి..

Oct 5 2016 2:20 PM | Updated on Sep 4 2017 4:17 PM

అక్రమంగా గుట్కా తయారు చేస్తున్న కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.

-విలువైన సామగ్రి స్వాధీనం
ఖమ్మం అర్బన్

నగర శివారులోని బల్లేపల్లి సమీపంలో మల్లిడి జగన్ అనే వ్యక్తికి సంబంధించిన మామిడితోటలో అక్రమంగా గుట్కా తయారు చేస్తున్న కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు రూ.50 లక్షలు విలువచేసే యంత్రాలు, ముడిపదార్ధాన్ని, రూ.5 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, కారు, ఒక ట్రాలీ, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు తెలుగు వాళ్లను, 9 మంది ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన కూలీలను అరెస్ట్ చేశారు. ఈ దాడులు వరంగల్ విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement