ఫేక్‌ ఆర్డర్లతో వేధింపులు! | Khammam Influencer Gunti Nagaraju Troubled By Fake COD Orders Worth Lakhs, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ఆర్డర్లతో వేధింపులు!

Oct 22 2026 12:02 PM | Updated on Oct 22 2026 12:38 PM

Online Fake Delivery Orders Gunti Nagaraju

ఖమ్మం జిల్లా: ఉదయం లేచింది మొదలు రాత్రి 11గంటల వరకు ఇంటి ముందు ఏదో సంస్థ డెలివరీ బాయ్‌ రావడం.. అన్నీ పోస్ట్‌ పెయిడ్‌ డెలీవరీ ఆర్డర్లే కావడంతో ఓ వ్యక్తి తనను వేధించొద్దని మొరపెట్టుకుంటున్నాడు. రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామానికి చెందిన గుంటి నాగరాజు సోషల్‌ మీడియాలో అకౌంట్‌ ద్వారా తన పర్యటనలు, తదితర అంశాలపై వీడియోలు పెడుతుంటాడు. 

ఆయన గతంలో తన పంట పాడైందని పోస్ట్‌ చేయగా ఒకరిద్దరు ఆర్థిక సాయం చేసినట్లు తెలిసింది. కాగా, ఇటీవల తమిళనాడులోని మధురైకి చెందిన షణ్ముకనాథన్‌ తనకు స్వీట్లు పంపించాలని కోరగా గుర్తుతెలియని వ్యక్తులు ప్రిజ్‌లు, ఏసీలు క్యాష్‌ పోస్ట్‌ పెయిడ్‌ రూపంలో ఆర్డర్లు బుక్‌ చేసిన విషయం విదితమే. ఇదే క్రమాన నాగరాజుకు కూడా గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు రోజులుగా టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, కూలర్లు, ఏసీలతో పాటు హోటళ్ల నుంచి తినుబండారాలు ఆర్డర్‌ చేస్తున్నారు. 

ఇవన్నీ సీఓడీ కావడంతో తాను బుక్‌ చేయలేదని నాగరాజు చెబితే కొందరు క్యాన్సిల్‌ చేస్తుండగా, మరికొందరు డబ్బు చెల్లించి తీసుకోవాలని గట్టిగా అడుగుతున్నారని తెలిసింది. పదుల సంఖ్యలో డెలివరీలు వస్తుండడంతో విసిగిపోయిన నాగరాజు రెండు సెల్‌ నంబర్లు స్విచాఫ్‌ చేసినా ఆర్డర్లు ఆగకపోవడంతో ‘దయచేసి నన్ను వేధించకండి.. ఎవరూ ఆర్డర్లు చేయకండి’ అంటూ మరో వీడియో పోస్ట్‌ చేయాల్సి వచ్చింది.

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement