Khammam: విషాదం.. నవ దంపతుల ఆత్మహత్య | Husband And Wife Tragedy Yerrupalem Khammam District | Sakshi
Sakshi News home page

Khammam: విషాదం.. నవ దంపతుల ఆత్మహత్య

Oct 13 2026 7:14 AM | Updated on Oct 13 2026 7:49 AM

Husband And Wife Tragedy Yerrupalem Khammam District

సాక్షి, ఖమ్మం జిల్లా: ఎర్రుపాలెంలో విషాదం చోటుచేసుకుంది. భార్య ఆత్మహత్య.. తట్టుకోలేక భర్త రైలు కింద పడి మృతి చెందాడు. నెల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఐదేళ్లుగా మహేశ్–వెంకటరమణ ప్రేమించుకుంటున్నారు. వివాహం అనంతరం దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని అమ్మమ్మ ఇంటి వద్ద వెంకటరమణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎర్రుపాలెం రైల్వేగేట్ సమీపంలో రైలు కింద పడి మహేశ్ మరణించాడు. ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

మరో ఘటనలో..
కొణిజర్ల మండలంలోని చిన్నమునగాల కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో పలువురిపై అనుమానం ఉందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ జి.సూరజ్‌ తెలిపిన వివరాలు... చిన్నమునగాలకు చెందిన మోదుగు వెంకటేశ్వర్లు(53) ఆస్తమా మాత్రలు తెచ్చుకుంటానని భార్య నిర్మలకు చెప్పి ఆదివారం పెద్దమునగాల వెళ్లాడు. అక్కడ మాత్రలు లేకపోవడంతో కొణిజర్ల వెళ్లిన ఆయన రాత్రి 7–30 గంటలకు తిరిగి పెద్ద మునగాల వరకు వచ్చానని భార్యకు ఫోన్‌లో చెప్పాడు.

ఆ తర్వాత ఇంటికి రాకపోవడం, భార్య ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో హైదరాబాద్‌లో ఉండే కుమారుడికి సమాచారం ఇచ్చింది. ఆపై కుటుంబ సభ్యులు రాత్రంతా చిన్నమునగాల, పెద్దమునగాల రోడ్డులో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం వెంకటేశ్వర్లు సోదరుడు సురేష్‌కు పెద్దమునగాల వాసి తడికమళ్ల బసవయ్య ఫోన్‌ చేసి రోడ్డు పక్కన చెట్ల పొదల్లో మృతదేహం ఉందని చెప్పడంతో వెళ్లేసరికి ముఖంపై రక్త గాయాలతో చనిపోయి ఉన్నాడు.

కాగా, గ్రామానికి చెందిన పాపకంటి ఏసోబు, అనసూయ, పెద్దనాగమ్మ, నరేష్, ముత్తిలింగం, వెంకటేశ్వర్లు, అన్నెపోగు భవాని, పుల్లమ్మ, అన్నెకుమారి, అన్నెపోగు రామారావు, కంపెల్లి ఇజ్రాయిల్, శ్రీకాంత్‌పై తమకు అనుమానం ఉందని వెంకటేశ్వర్లు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సూరజ్‌ తెలిపారు. 

ఇదీ చదవండి: కుమార్తెకు ఫోన్‌ చేసిన కాసేపటికే విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement