'ఫోన్లు మావి కాదు.. ట్యాప్ చేశారు' | that mobile phones are not us | Sakshi
Sakshi News home page

'ఫోన్లు మావి కాదు.. ట్యాప్ చేశారు'

Jul 9 2015 4:59 PM | Updated on Sep 3 2017 5:11 AM

'ఫోన్లు మావి కాదు.. ట్యాప్ చేశారు'

'ఫోన్లు మావి కాదు.. ట్యాప్ చేశారు'

తమపై కుట్ర పూరితంగానే ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఓటుకు కోట్లు కేసు నిందితుడు సెబాస్టియన్ అన్నారు.

హైదరాబాద్: తమపై కుట్ర పూరితంగానే ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఓటుకు కోట్లు కేసు నిందితుడు సెబాస్టియన్ అన్నారు. కండిషనల్ బెయిల్లో భాగంగా ఏసీబీ కార్యాలయానికి వచ్చిన సెబాస్టియన్ అక్కడి మీడియా ప్రతినిధులతో అరకొరగా మాట్లాడారు. అసలు ఆ ఫోన్లు తమవి కాదని, ట్రాప్ చేశారని, కుట్రలు చేశారంటూ రుసరుసలాడారు.

 

ఇదే సందర్భంలో ఓటుకు నోటు కేసులో జనార్దన్ పేరు వినిస్తోందని, అసలు జనార్దన్ ఎవరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అతడు టీడీపీ కార్యాలయం ఇన్చార్జీ అని, తమ నాయకుడు చంద్రబాబు దృష్టికి ఏవైనా అంశాలు తీసుకెళ్లాలంటే జనార్దన్ ద్వారానే తీసుకెళతామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement