సిట్‌ ఎదుట హాజరైన పారిజాత దంపతులు | Former Mayor Of Badangpet Corporation Appears Before SIT | Sakshi
Sakshi News home page

సిట్‌ ఎదుట హాజరైన పారిజాత దంపతులు

Jun 4 2026 8:47 AM | Updated on Jun 4 2026 8:50 AM

Former Mayor Of Badangpet Corporation Appears Before SIT

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో వాంగ్మూలం నమోదు  

బడంగ్‌పేట్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ మాజీ మేయర్‌ చిగురింత పారిజాత, నర్సింహారెడ్డి దంపతులు బుధ వారం సిట్‌ ఎదుట హాజర య్యారు. బీఆర్‌ఎస్‌ నేతలైన వీరు 2022లో ఆపార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. పారిజాత ప్రస్తుతం పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

బీఆర్‌ఎస్‌లో ఉన్న సమయంలో పారిజాతతో పాటు ఆమె భర్త ఫోన్లు ట్యాప్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఇరువురి మాటలను రికార్డు చేశారు. ఫోన్ల ట్యాపింగ్‌తో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బాధితులు వివరించగా, వాటిని రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తాము ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అనుకున్నప్పటి నుంచి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేయడానికి ఫోన్‌ ట్యాపింగే కారణం కావచ్చన్నారు. 2 రోజుల క్రితం సిట్‌ అధికారులు చెప్పే వర కూ ఈ విషయం తమకు తెలియదన్నారు. సిట్‌ అధి కారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement