తెలుగు ప్రజలకు శ్రమించే తత్వం ఉంది: జైట్లీ | telugu people has hard working manner, says arun jaitley | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజలకు శ్రమించే తత్వం ఉంది: జైట్లీ

Jan 10 2016 5:10 PM | Updated on May 3 2018 3:17 PM

తెలుగు ప్రజలకు శ్రమించే తత్వం ఉంది: జైట్లీ - Sakshi

తెలుగు ప్రజలకు శ్రమించే తత్వం ఉంది: జైట్లీ

తెలుగు ప్రజలకు శ్రమించే తత్వం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

విశాఖపట్నం: తెలుగు ప్రజలకు శ్రమించే తత్వం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆదివారం విశాఖలో ప్రారంభమైన భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) 22వ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని అభిప్రాయపడ్డారు.

పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని చెప్పారు. ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రం పెట్టుబడుల సదస్సులు నిర్వహిస్తున్నాయన్నారు. పెట్టుబడిదారులు కూడా తెలివిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని హామీయిచ్చారు. రాష్ట్రానికి ఇస్తున్న పారిశ్రామిక రాయితీలు కొనసాగిస్తామని భరోసాయిచ్చారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement