తీరికలేదు తల్లీ..! | Telugu Language Day celebrations leisure or | Sakshi
Sakshi News home page

తీరికలేదు తల్లీ..!

Aug 30 2016 6:57 PM | Updated on Aug 10 2018 9:46 PM

తీరికలేదు తల్లీ..! - Sakshi

తీరికలేదు తల్లీ..!

మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. అని కీర్తిస్తున్నాం.. కానీ ఆ తల్లి మెడలో వాడిన పూలదండ..గ్రాంధిక చెరలో మగ్గిపోయిన తెలుగును సామాన్యులకు చేరువ చేశారంటూ గిడుగు రామ్మూర్తికి నీరాజనాల గొడుగు పడుతున్నాం..ఆయన జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా కొన్నేళ్ల నుంచీ జరుపుకొంటున్నాం.. కానీ దురదృష్టం..

మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. అని కీర్తిస్తున్నాం.. కానీ ఆ తల్లి మెడలో వాడిన పూలదండ..గ్రాంధిక చెరలో మగ్గిపోయిన తెలుగును సామాన్యులకు చేరువ చేశారంటూ గిడుగు రామ్మూర్తికి నీరాజనాల గొడుగు పడుతున్నాం..ఆయన జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా కొన్నేళ్ల నుంచీ జరుపుకొంటున్నాం.. కానీ దురదృష్టం.. తెలుగును బతికించాల్సిన పాలకులకే తెలుగుతల్లి గానీ.. గిడుగువారు గానీ గుర్తురాలేదు..తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఏర్పడిందని ఘనంగా చెప్పుకొంటున్న తెలుగుదేశం ఏలుబడిలో ఉన్న సమయంలోనే ఈ దురవస్థ పట్టడం నిజంగా విచారకరం. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలు ఉత్సాహంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించగా.. మంత్రులు, అధికార పార్టీ ప్రముఖులు అసలు వాటి చాయలకే పోకపోవడం సిగ్గుచేటు..సాధారణంగా సాంస్కతిక శాఖ ప్రభుత్వపరంగా అధికారికంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంటుంది. కానీ ఈసారి ఎందుకో అధికారులు సైతం శీతకన్ను వేశారు. ఫలితంగా మద్దిలపాలెం జంక్షన్‌లో ప్రభుత్వమే ఏర్పాటు చేసిన తెలుగుతల్లి విగ్రహం ఒక్క పూలదండ కాదు కదా.. కనీసం శుభ్రతకైనా నోచుకోకుండా ఇదిగో ఇలా.. దీనంగా మిగిలిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement