రాష్ట్రస్థాయి క్విజ్‌లో ‘తేజ’కు ప్రథమ స్థానం | Teja first place In state level quiz competiotions | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి క్విజ్‌లో ‘తేజ’కు ప్రథమ స్థానం

Sep 3 2016 12:03 AM | Updated on Sep 4 2017 12:01 PM

రాష్ట్రస్థాయి  క్విజ్‌లో ‘తేజ’కు ప్రథమ స్థానం

రాష్ట్రస్థాయి క్విజ్‌లో ‘తేజ’కు ప్రథమ స్థానం

ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ సంస్థ రాష్ట్ర స్థాయిలో శుక్రవారం హైద్రాబాద్‌లో నిర్వహించిన వైల్డ్‌ విజ్‌డమ్‌ క్విజ్‌లో కోదాడలోని తేజ విద్యాలయానికి చెందిన విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు.

కోదాడ: ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ సంస్థ రాష్ట్ర స్థాయిలో శుక్రవారం హైద్రాబాద్‌లో నిర్వహించిన వైల్డ్‌ విజ్‌డమ్‌ క్విజ్‌లో కోదాడలోని తేజ విద్యాలయానికి చెందిన విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. వీరు త్వరలో డిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పైనల్‌లో రాష్ట్రం తరుపున పాల్గొననున్నారు. పాఠశాలకు చెందిన పవన్‌కుమార్‌రెడ్డి (7వ తరగతి), పవన్‌ (8వ తరగతి) విద్యార్థుల టీం 150 మార్కులతో ప్రథమ స్థానం సాధించింది. మొత్తం 108 టీంలు పాల్గొన్న ఈ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్ర«థమ స్థానం సాధించడం పట్ల పాఠశాల నిర్వాహకులు రమాసోమిరెడ్డి, జానకిరామయ్య హర్షం వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా తమ పాఠశాల విద్యార్థులు వరుసగా ప్రథమ స్థానం సాధిస్తున్నారని వారు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement