రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | Teenager killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Dec 20 2016 11:25 PM | Updated on Aug 30 2018 4:10 PM

వై.కొత్తపల్లి వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రమణానాయక్‌ (35) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు..

ఆత్మకూరు : వై.కొత్తపల్లి వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రమణానాయక్‌ (35) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం తరగకుంట తండాకు చెందిన రమణా నాయక్‌ మరో నలుగురితో కలిసి సోమవారం బెళుగుప్ప మండలం కాలువపల్లి వద్ద ఆలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఇన్నోవా వాహనంలో వెళ్లారు. అదే రోజు రాత్రి తిరిగి అక్కడి నుంచి అనంతపురం వెళ్తుండగా ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి వద్దకు రాగానే ఇన్నోవా వాహనం టైరు పంక్చర్‌ కావడంతో అదుతుప్పి ప్రమాదానికి గురైంది. డ్రైవింగ్‌  చేస్తున్న రమణానాయక్‌కు తీవ్రంగా గాయపడ్డారు. వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తులు వెంటనే 108కు సమాచారం అందించగా రమణానాయక్‌ను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలో రమణానాయక్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement