మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం బూర్గుల వద్ద సాంకేతిక లోపంతో శనివారం ఉదయం ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది.
షాద్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం బూర్గుల వద్ద సాంకేతిక లోపంతో శనివారం ఉదయం ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో సాంకేతిక లోపంతో గూడ్స్ నిలిచిపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు.
ఉదయం 10.30 గంటల సమయంలో వేరొక ఇంజన్‌ను రప్పించి గూడ్స్ రైలును అక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేశారు. దీంతో సుమారు మూడు గంటలకుపైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.