రైలు ఇంజన్‌పై పడ్డ బండరాయి.. తప్పిన పెను ప్రమాదం | Goods Train Derails Between Taida And Chimidipally Railway Stations | Sakshi
Sakshi News home page

రైలు ఇంజన్‌పై పడ్డ బండరాయి.. తప్పిన పెను ప్రమాదం

Oct 19 2025 10:26 AM | Updated on Oct 19 2025 11:25 AM

Goods Train Derails Between Taida And Chimidipally Railway Stations

సాక్షి, అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఐరన్‌ లోడ్‌తో వెళ్తున్న రైలు ఇంజన్‌పై బండరాయి పడింది. దీంతో గూడ్స్‌  రైలు ఇంజన్‌ ముందు భాగం దెబ్బతింది. ఇవాళ (అక్టోబర్‌ 19, ఆదివారం) తెల్లవారుజామున తైడా​​​- చిమిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఘటన జరిగింది. కొత్తవలస​‍-కిరండోల్‌ లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

విశాఖ- కిరండోల్, కిరండోల్-విశాఖ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆ మార్గంలో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది తక్షణమే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: ధనత్రయోదశి ప్రభావం.. బంగారం ఎంత కొన్నారంటే?
 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement