మండలంలోని సోమఘట్ట పంచాయతీ చెరువుకిందపల్లి పాఠశాలకు చెరువుముందరపల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు సరస్వతిని నెలరోజుల పాటు డిప్యూటేషన్‌పై పంపినట్లు ఎంఈఓ సురేష్‌బాబు తెలిపారు.
- సాక్షి ఎఫెక్ట్
చిలమత్తూరు: మండలంలోని సోమఘట్ట పంచాయతీ చెరువుకిందపల్లి పాఠశాలకు చెరువుముందరపల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు సరస్వతిని నెలరోజుల పాటు డిప్యూటేషన్‌పై పంపినట్లు ఎంఈఓ సురేష్‌బాబు తెలిపారు. శనివారం ‘మూత బడి’ అనే శీర్షికన చెరువుకిందపల్లి పాఠశాలలో టీచర్ లేరంటూ ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. రెగ్యులర్ టీచర్‌ను నియమించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.