10 మంది తహసీల్దార్ల బదిలీ | tahasildars transfer | Sakshi
Sakshi News home page

10 మంది తహసీల్దార్ల బదిలీ

May 24 2017 10:42 PM | Updated on Apr 4 2019 2:50 PM

రెవెన్యూ శాఖలో 10 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

- పది రోజుల్లోనే వెల్దుర్తి తహసీల్దారుకు స్థానచలనం
– అధికార పార్టీ సిఫారసులకు అనుగుణంగానే బదిలీలు
 
కర్నూలు(అగ్రికల్చర్‌): రెవెన్యూ శాఖలో 10 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ముగ్గురు తహసీల్దార్లను మార్చారు. దీంతో 13 మంది తహసీల్దార్లను బదిలీ చేసినట్లయింది. కృష్ణగిరి మండల తహసీల్దారును బదిలీ చేసినప్పటికీ ఆ స్థానంలో ఎవ్వరిని నియమించలేదు. ఆళ్లగడ్డ సీఎస్‌డీటీగా పనిచేస్తున్న సుబ్బరాయుడుకు ఇటీవలనే తహసీల్దారుగా పదోన్నతి లభించింది. ఈయనకు కూడా కలెక్టర్‌ పోస్టింగ్‌ ఇచ్చారు. 10 రోజుల క్రితమే డీటీ నుంచి పదోన్నతి పొందిన కె.వి. శ్రీనివాసులును వెల్దుర్తి తహసీల్దారుగా నియమించారు.తాజాగా ఈయనను కూడా బదిలీ చేయడం గమనార్హం. అధికార పార్టీ నేతల సూచనల మేరకే బదిలీ చేసినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల మీ కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ భూముల ఆన్‌లైన్‌ వ్యవహారంలో మహనంది తహసీల్దారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందువల్లనే ఆయనను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
 
తహసీల్దార్ల బదిలీల్లో అధికార పార్టీ ముద్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధికార పార్టీ నేతల సిఫారసులకు అనుగుణంగానే బదిలీలు జరిగినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల బనగానపల్లి తహసీల్దారుగా ఉన్న అనురాధను ఆదోని ఆర్‌డీఓ ఆఫీసు ఏఓగా బదిలీ చేశారు. అలాగే కోడుమూరులో ఉన్న నిత్యానందరాజును కొత్తపల్లికి మార్చారు. వీరు ఆయా స్థానాల్లో చేరలేదు. వీరికి తాజా బదిలీల్లో స్థానాలు కేటాయించలేదు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ముగ్గురు సెక‌్షన్‌ సూపరిటెండెంట్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎవరినీ కదిలించలేదు.
 
తహసీల్దార్ల బదిలీలు ఇలా..
 
తహశీల్దారు పేరు               పనిచేస్తున్న స్థానం బదిలీ అయిన స్థానం
 
గోపాలరావు                       కృష్ణగిరి                        తుగ్గలి
రామాంజనేయులు నాయక్‌     ఆదోని కేఆర్‌ఆర్‌సీ           వెల్దుర్తి
కేవీ శ్రీనివాసులు                   వెల్దుర్తి                         శ్రీశైలం
విజయుడు                          శ్రీశైలం                      ఆదోని కేఆర్‌ఆర్‌సీ
పి.రామకృష్ణుడు                     మహనంది                 కొత్తపల్లి
సుబ్బరాయుడు                   పదోన్నతి                    మహనంది
నాగకళ్యాణి                        గోస్పాడు                       గడివేముల
సుధాకర్‌                          గడివేముల                      గోస్పాడు
ఇంద్రాణి                            సంజామల                       శిరువెల్ల
సుధాకర్‌                                శిరువెల్ల                      సంజామల
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement