విద్యుత్‌ కౌంటర్లలో స్వైప్‌మిషన్లు | swipe machines in vidyut counters | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కౌంటర్లలో స్వైప్‌మిషన్లు

Nov 30 2016 11:14 PM | Updated on Oct 16 2018 3:38 PM

విద్యుత్‌ వినియోగకేంద్రాలు, సేవా కేంద్రాల్లో స్వైప్‌ మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఆర్‌ఎన్‌ ప్రసాదరెడ్డి, సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఏవో) టి.విజయభాస్కర్‌ తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : విద్యుత్‌ వినియోగకేంద్రాలు, సేవా కేంద్రాల్లో స్వైప్‌ మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఆర్‌ఎన్‌ ప్రసాదరెడ్డి, సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఏవో) టి.విజయభాస్కర్‌ తెలిపారు. ఈ మేరకు బ్యాంకు ఆఫ్‌ బరోడా నుంచి 60 స్వైప్‌మిషన్లు మంజూరైనట్లు తెలిపారు. రెండు రోజుల్లో అనంతపురం, తాడిపత్రిలో రెండు చొప్పున, హిందూపురం, గుంతకల్లు, ధర్మవరం, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, కదిరిలో ఒక్కొక్కటి చొప్పున ఇన్‌స్టాల్‌ చేయనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement