breaking news
swipe machines
-
‘టెక్’ పోలీసింగ్
► నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానం ► వినియోగంలోకి సీసీ కెమెరాలు.. వాట్సప్ నంబర్లు ► జరిమానా వసూళ్ల కోసం స్వైప్ మిషన్లు ► జిల్లా పోలీసుల సరికొత్త ప్రయోగం నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిండంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిందితుల ఆచూకీ కనిపెట్టడం, నేరస్తులను పట్టుకోవడం, అనుమానితులు, అసాంఘికశక్తుల ఆట కట్టించడం కోసం ప్రధాన పట్టణాలు, కూడళల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని డ్రంకెన్ డ్రైవ్ ద్వారా అదుపులోకి తీసుకుంటూ రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇంకో అడుగు ముందుకు వేసి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారి వివరాలు తెలిపేందుకు, అసాంఘిక కార్యకలాపాలను పోలీసులకు చేరవేసేందుకు వాట్సాప్ నంబరును అందుబాటులోకి తెచ్చారు. వివిధ సందర్భాల్లో దోషుల నుంచి జరిమానా వసూలు చేసేందుకు ఇటీవల స్వైపింగ్ మిషన్లను ప్రారంభించి నగదు రహిత లావాదేవీలవైపు పయనిస్తున్నారు. మొత్తంగా ‘టెక్’ పోలీసింగ్‌లో అగ్రస్థానంలో నిలిచేందుకు ముందుకు సాగుతున్నారు. – సిరిసిల్ల క్రైం సిరిసిల్ల క్రైం : జిల్లాలో షీటీం విభాగం సత్ఫలితాలిస్తోంది. మహిళలు, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం, వేధించడాన్ని నేరుగా పోలీసులకు చేరవేసేందుకు 94409 04823 మొబైల్ నంబరును అందుబాటులోకి తెచ్చారు. బాధితులు ఈ నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు అందించిన క్షణాల్లో షీటీం సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఈరెండు నెలల్లోనే ఇలాంటివి ఐదు కేసులు నమోదు చేశారు. దాదాపు 100 మంది పోకిరీకి కౌనెలింగ్తో హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలోని వివిధ రకాల నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు, సమాచారం అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 100 టోల్‌ఫ్రీ నంబరునూ వినియోగించాలని సూచిస్తున్నారు. ఎస్పీ పేరుతో ఏర్పాటు చేసిన 799755 5511 వాట్సాప్ నంబరు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. మద్యం తాగి పట్టుబడితే తప్పించుకనేదిలేదు.. మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు చిక్కితే తప్పించుకునే వీలులేకుండా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇట్లాంటి వారిని గుర్తించి, జరిమానా విధించేందుకు బ్రీతింగ్ ఎనలైజర్ అనేక యంత్రాన్ని వినియోగిస్తున్నారు. సాంకేతిక మీటర్ తనిఖీలో 30పాయింట్లకన్నా ఆల్కహాల్ అధికంగా ఉంటే జరిమానా విధిస్తున్నారు. దీని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే చాన్స్ లేకుండా స్వైపింగ్‌మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. జరిమానాల వసూళ్లకు సాంకేతిక సాయం.. ఇప్పటి వరకు జరిమానాలు చెల్లించేందుకు హ్యాండ్ టు హ్యాండ్ విధానం వినియోగించేవారు. లేదా చలాన్ల ద్వారా జరిమానా విధించేవారు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్‌లు స్వైపింగ్ మిషన్ ద్వారా జరిమానా వసూలు చేస్తున్నారు. ఇటీవల డీఐజీ రవివర్మ ఈ యంత్రాలను ఆవిష్కరించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యమో.. నేరుగా డబ్బులు పోలీస్ విభాగానికి చేరాలనో ఏమోగానీ.. మొత్తానికి నగదు రహిత లావాదేవీలకు ట్రాఫిక్ విభాగంలో స్వైపింగ్ మిషన్ విధానాన్ని అమలు చేస్తోంది. సీసీ కెమెరాల వినియోగం.. నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు వినియోగం అధికంగా ఉంటోంది. వీటి వినియోగం జిల్లా కేంద్రంతోపాటు వేములవాడ రాజన్న ధర్మక్షేత్రంలో అ«ధికంగా ఉంది. సిరిసిల్లలో 42 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేయగా, వేములవాడ రాజన్న «క్షేత్రంలో 280కి పైగా సీసీ కెమెరాలున్నాయి. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీలు పరిశీలించి, వాటి ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు. కేసును స్వల్పకాలంలోనే ఛేదిస్తున్నారు. నిందితులను పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తున్నారు. భక్తులతో కిటకిటలాడే రాజన్న సన్నిధానంలో ఇద్దరు చిన్నారుల ఆచూకీని తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు అత్యంత కీలకపాత్ర వహించాయి. ఈఏడాది సుమారు 15 కేసుల్లో సీసీ కెమెరాల సాయం తీసుకున్నట్లు వేములవాడ పోలీసులు చెబుతున్నారు. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో వాహనాల చోరీ నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడినట్లు అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల సంఖ్య పెంచుతాం సిరిసిల్ల జిల్లా కేంద్రంగా మారిన క్రమంలో ఇక్కడ సీసీ కెమెరాల సంఖ్య పెంచుతాం. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుత సీసీ కెమెరాల పనితీరు మెరుగుపర్చేందుకు నేరుగా కరెంట్ సరఫరా చేయాలని ‘సెస్’ అధికారులను విన్నవించాం. – విజయ్ కుమార్, సీఐ, సిరిసిల్ల పర్యవేక్షణ రూమ్ ఏర్పాటు చేస్తాం పోలీసుల నేతృత్వంలో 80, రాజన్న ఆలయం ఆధ్వర్యంలో 100, ప్రైవేట్ లాడ్జీల్లో మరో 80 సీసీ కెమెలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి. వీటి సాయంతో నేరస్తులను పట్టుకుంటున్నాం. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నాం. ఈఏడాదిలో 13 కేసులు ఛేదించాం. త్వరలోనే కమాండింగ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు కానుంది. – శ్రీనివాస్, సీఐ వేములవాడ -
విద్యుత్ కౌంటర్లలో స్వైప్‌మిషన్లు
అనంతపురం అగ్రికల్చర్ : విద్యుత్ వినియోగకేంద్రాలు, సేవా కేంద్రాల్లో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎస్‌ఏవో) టి.విజయభాస్కర్ తెలిపారు. ఈ మేరకు బ్యాంకు ఆఫ్ బరోడా నుంచి 60 స్వైప్‌మిషన్లు మంజూరైనట్లు తెలిపారు. రెండు రోజుల్లో అనంతపురం, తాడిపత్రిలో రెండు చొప్పున, హిందూపురం, గుంతకల్లు, ధర్మవరం, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, కదిరిలో ఒక్కొక్కటి చొప్పున ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలిపారు. -
ఆర్టీఏలో నగదు రహిత సేవలు ప్రారంభం
అనంతపురం సెంట్రల్ : రోడ్డు రవాణా శాఖలో నగదు రహిత సేవలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్లు రద్దు నిర్ణయంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డీటీసీ సుందర్‌వడ్డీ మంగళవారం విజయవాడ నుంచి స్వైప్ మిషన్లు తెప్పించారు. అనంతపురం, హిందూపురం ఆర్టీఓ కార్యాలయాలతో పాటు పెనుకొండ చెక్‌పోస్టులో వీటిని ప్రారంభించారు. డీటీసీ సుందర్‌వడ్డీ మాట్లాడుతూ వాహనదారులు క్రెడిట్‌కార్డు, రూపే కార్డులను వినియోగించి సేవలను పొందవచ్చునన్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో స్వైప్ మిషన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. అన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, కార్లు, జీపుల నిర్వాహకులు కూడా స్వైపు మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించామన్నారు. ఇప్పటికే 15 బస్సు ట్రావెల్స్ నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. మిగిలినవాటిలో త్వరలోనే ఏర్పాటు చేయిస్తామన్నారు. -
ఎరువుల అంగళ్లలో స్వైప్‌మిషన్లు తప్పనిసరి
– వ్యవసాయ శాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల డీలర్లు తప్పనిసరిగా స్వైప్‌మిషన్లు (పాయింట్ ఆఫ్ సేల్స్–పీవోఎస్) ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ) పీవీ శ్రీరామమూర్తి ఆదేశించారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. త్వరితగతిన వాటిని ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఏవోలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. కరెంటు అకౌంట్లు కలిగిన బ్యాంకుల్లో రెండు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదిలావుండగా.. జేడీఏ ఆదేశాల మేరకు అనంతపురం రూరల్ వ్యవసాయాధికారి(ఏవో) జే.వాసుప్రకాష్ శనివారం నగరంలోని అన్ని దుకాణాలు తిరిగి స్వైప్మిషన్ల ఏర్పాటు, పనితీరు, సమస్యలపై డీలర్లకు వివరించారు. ఆధార్, పాన్, పిన్, అకౌంట్ నెంబర్ సమర్పించి తక్షణం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతరత్రా వాటిని రైతులకు అందజేయడానికి వీలుగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. కొన్ని రోజుల పాటు ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్తులో డీలర్లకు, రైతులకు ఎలాంటి సమస్యా ఉండదన్నారు. -
మైక్రో ఏటీఎంతో చిల్లర కష్టాలకు చెక్
-
బస్సుల్లో స్వైప్ మిషన్లు తప్పనిసరి
అనంతపురం సెంట్రల్ : పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని బస్సుల్లోనూ స్వైప్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీఓ శ్రీధర్ తెలిపారు. ఆయన బుధవారం ఆర్టీఓ కార్యాలయంలోని తన ఛాంబర్లో జిల్లాలోని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లోనూ స్వైప్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నారని, మీరు కూడా సమకూర్చుకోవాలని ఆదేశించారు. దీనివల్ల అకౌంట్లలో డబ్బులున్న ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్ ధర చెల్లించే వీలు ఉంటుందన్నారు. శుభకార్యాలు, టూర్లకు వెళ్లేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అందువల్ల ప్రభుత్వ ఆదేశాలనుసరించి ప్రతి ఒక్కరూ స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలా కాకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు మోహన్‌రాజు, సుధీర్‌కుమార్, ఖాన్, రఘునాథ్, అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.