అంధకారంలో సున్నిపెంట | sunnipenta in darkness | Sakshi
Sakshi News home page

అంధకారంలో సున్నిపెంట

Nov 3 2016 11:55 PM | Updated on Sep 4 2017 7:05 PM

ఏపీ ట్రాన్స్‌కోకు శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్‌ శాఖ విద్యుత్‌ బకాయి చెల్లించపోవడంతో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

విద్యుత్‌ బకాయి చెల్లించకపోవడంత సరఫరా నిలిపివేత
 
శ్రీశైలం ప్రాజెక్టు : ఏపీ ట్రాన్స్‌కోకు శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్‌ శాఖ విద్యుత్‌ బకాయి చెల్లించపోవడంతో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. కాలనీ మొత్తం అంధకార మయమైంది. ఇరిగేషన్‌ శాఖ  రూ.14 కోట్లు బకాయి ఉంది. ఇదిలా ఉండగా సున్నిపెంట కాలనీలో ఏపీ ›ట్రాన్స్‌కో మీటర్లు బిగించి కనెక‌్షన్లను స్వాధీనం చేసుకోవాల్సిందిగా గతంలో జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్‌కో మీటర్లు బిగిస్తున్నా కనెక‌్షన్లను తమ కంట్రోల్‌లోకి తీసుకోకపోవడంతో బిల్లుల వసూలు బాధ్యత ఎవరి తీసుకోవాలనే సందిగ్ధం నెలకొంది. విద్యుత్‌ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ట్రాన్స్‌కో అధికారులను కోరారు.   
 
 

Advertisement
 
Advertisement
Advertisement