యోగాలో సుజాత ప్రతిభ | sujatha at her best | Sakshi
Sakshi News home page

యోగాలో సుజాత ప్రతిభ

Aug 7 2016 11:01 PM | Updated on Sep 4 2017 8:17 AM

జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన సుజాత, సాయి కిరణ్‌

జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన సుజాత, సాయి కిరణ్‌

జిల్లా స్థాయిలో జరిగిన యోగా పోటీల్లో పట్టణానికి చెందిన గవిడి సుజాత అనే గృహిణి చక్కని ప్రతిభ కనపరిచి స్థానికుల నుంచి అభినందనలు దక్కించుకుంది. ఈ నెల 6న విజయనగరంలోని భాష్యం పాఠశాలలో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 35 ఏళ్ల విభాగంలో పాల్గొన్న పట్టణానికి చెందిన గవిడి సుజాత జిల్లా స్థాయిలో తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు.

 
చీపురుపల్లి: జిల్లా స్థాయిలో జరిగిన యోగా పోటీల్లో పట్టణానికి చెందిన గవిడి సుజాత అనే గృహిణి చక్కని ప్రతిభ కనపరిచి స్థానికుల నుంచి అభినందనలు దక్కించుకుంది. ఈ నెల 6న విజయనగరంలోని భాష్యం పాఠశాలలో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 35 ఏళ్ల విభాగంలో పాల్గొన్న పట్టణానికి చెందిన గవిడి సుజాత జిల్లా స్థాయిలో తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. జిల్లా స్థాయి యోగా పోటీల్లో తృతీయ స్థానాన్ని సంపాదించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవ్వడం పట్ల స్థానికంగా హర్హం వ్యక్తం అవుతోంది. పట్టణానికి చెందిన సాయికిరణ్‌ అనే విద్యార్థి 8 ఏళ్ల విభాగంలో జిల్లా స్థాయిలో తృతీయ స్థానాన్ని సంపాదించుకున్నాడు. పట్టణంలోని కొత్తగవిడివీధిలో యోగా గురువు వెంకటరమణ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా కేంద్రంలో వీరు గత కొంత కాలంగా శిక్షణ తీసుకుంటున్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల యోగా గురువు వెంకటరమణ వీరిని అభినందించారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement