లారీ డ్రైవర్‌ ఆత్మహత్య | Suicide lorry driver | Sakshi
Sakshi News home page

లారీ డ్రైవర్‌ ఆత్మహత్య

Dec 15 2016 1:10 AM | Updated on Nov 6 2018 7:53 PM

లారీ డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు బతుకు భారమై అతను జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. రైలు కింద దూకి తనువు చాలించాడు. ఈ ఘటన అనంతపురంలోని రామచంద్రనగర్‌ రైల్వేగేట్‌ సమీపంలో బుధవారం జరిగింది.

అనంతపురం సెంట్రల్‌ :
లారీ డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు బతుకు భారమై అతను జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. రైలు కింద దూకి తనువు చాలించాడు. ఈ ఘటన అనంతపురంలోని రామచంద్రనగర్‌ రైల్వేగేట్‌ సమీపంలో బుధవారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని ఎర్నాలకొట్టాలలో నివాసముంటున్న కొండయ్య(55) లారీ డ్రైవర్‌గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీంతో చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement