అప్పటి వరకు అందరితో గడిపి.. అంతలోనే ఆత్మహత్య | Suicide in prathibha | Sakshi
Sakshi News home page

అప్పటి వరకు అందరితో గడిపి.. అంతలోనే ఆత్మహత్య

Feb 14 2016 12:45 AM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పటి వరకు అందరితో గడిపి.. అంతలోనే ఆత్మహత్య - Sakshi

అప్పటి వరకు అందరితో గడిపి.. అంతలోనే ఆత్మహత్య

ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

మెదక్: ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం చీనూర్ గ్రామానికి చెందిన ప్రతిభ (25) భర్త సంతోష్‌కుమార్, ఇద్దరు పిల్లలతో కలిసి బ్రాహ్మణ వీధిలో అద్దెకుంటున్నారు. సంతోష్‌కుమార్ నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం వరకు భార్యాభర్తలు పిల్లలతో కలిసి అందరు ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం ఆడుకునేందుకు బయటకు వెళ్లిన పిల్లలు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చారు. తల్లి ఎంతకీ తలుపు తీయలేదు. విషయం గమనించిన స్థానికులు సంతోష్‌కుమార్‌కు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. అతను వచ్చినప్పటికీ తలుపు తీయక పోవడంతో వాటిని పెకిలించి లోపలికి వెళ్లి చూడగా ప్రతిభ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రతిభ తల్లిదండ్రులు జహీరాబాద్‌లో ఉంటారని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement