ఎంపీ, ఎమ్మెల్యే గొడవతో అధికారికి గుండెపోటు | sub registrar got heart attack after watching mp, mla clashes | Sakshi
Sakshi News home page

ఎంపీ, ఎమ్మెల్యే గొడవతో అధికారికి గుండెపోటు

Jan 4 2016 11:56 AM | Updated on Sep 3 2017 3:05 PM

ఎంపీ, ఎమ్మెల్యే గొడవతో అధికారికి గుండెపోటు

ఎంపీ, ఎమ్మెల్యే గొడవతో అధికారికి గుండెపోటు

మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయాక్ల మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరుకుంది.

వరంగల్: మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయాక్ల మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరుకుంది. నూతన రిజిస్ట్రార్ కార్యాలయ ప్రారంభోత్సవంలో రభస చోటుచేసుకుంది. సోమవారం ప్రారంభోత్సవం చేయొద్దని ఎంపీ సీతారాంనాయక్ గట్టిగా వాదించారు.

ప్రారంభోత్సవం సోమవారం చేసి తీరాల్సిందేనని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్టుపట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేల గొడవతో సబ్ రిజిస్ట్రార్కు గుండె పోటు వచ్చింది. వెంటనే అయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement