ఆటోడ్రైవర్‌ను చితకబాదిన ఎస్‌ఐ | Sub inspector brutally beats auto driver | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్‌ను చితకబాదిన ఎస్‌ఐ

Jun 21 2016 4:18 PM | Updated on Sep 2 2018 5:06 PM

ఓ ఆటోడ్రైవర్‌ను అమానుషంగా చితకబాదిన ఎస్‌ఐ తీరుకు నిరసనగా పోలీస్‌ స్టేషన్‌ ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగిన సంఘటన అశ్వాపురంలో జరిగింది.

- పోలీసు స్టేషన్‌ ఎదుట గ్రామస్తుల ఆందోళన

అశ్వాపురం (ఖమ్మం జిల్లా) : ఓ ఆటోడ్రైవర్‌ను అమానుషంగా చితకబాదిన ఎస్‌ఐ తీరుకు నిరసనగా పోలీస్‌ స్టేషన్‌ ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగిన సంఘటన అశ్వాపురంలో జరిగింది. అశ్వాపురం ఎస్‌ఐ దుందుడుకుగా వ్యవహరించి గొల్లగూడెంకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ను చిన్న కారణానికి అమానుషంగా చితకబాదాడు. ఎస్‌ఐ తీరును నిరసిస్తూ మంగళవారం పోలీస్‌ స్టేషన్‌ ఎదుటు గ్రామస్తులతోపాటు కాంగ్రెస్‌, సీపీఐ, టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసు అధికారులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

Advertisement
 
Advertisement
Advertisement