ఖాళీప్లేట్లతో విద్యార్థుల నిరసన | students protest with empty plates | Sakshi
Sakshi News home page

ఖాళీప్లేట్లతో విద్యార్థుల నిరసన

Aug 12 2016 7:23 PM | Updated on Sep 4 2017 9:00 AM

ఖాళీప్లేట్లతో విద్యార్థుల  నిరసన

ఖాళీప్లేట్లతో విద్యార్థుల నిరసన

సూర్యాపేట : ప్రభుత్వ హాస్టళ్లలో, పాఠశాలల్లో సన్న బయ్యం మార్చి దొడ్డు బియ్యంతో విద్యార్థులకు ఆహారం అందిస్తున్న వార్డెన్‌లు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు జటంగి సురేష్‌ డిమాండ్‌ చేశారు.

సూర్యాపేట : ప్రభుత్వ హాస్టళ్లలో, పాఠశాలల్లో సన్న బయ్యం మార్చి దొడ్డు బియ్యంతో విద్యార్థులకు ఆహారం అందిస్తున్న వార్డెన్‌లు, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు జటంగి సురేష్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం టీజీవీపీ ఆధ్వర్యంలో పట్టణంలో ఖాళీ ప్లేట్లతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్లలో సన్న బియ్యం ఏర్పాటు చేస్తుంటే కొంత మంది ఉపాధ్యాయులు, వార్డెన్‌లు దొడ్డు బియ్యం వండిస్తున్నారని ఆరోపించారు. విద్యాధికారులు స్పందించి సన్నబియ్యం మాయం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సైదుల సాయి, కూజ ఎల్లేష్, ఆకారపు నిరంజన్, సతీష్, వీరారెడ్డి, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement