హాస్టల్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | student sucide atment | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Aug 29 2016 11:39 PM | Updated on Nov 9 2018 5:02 PM

భీమదేవరపల్లిమండలంలోని ముల్కనూర్‌ ఎస్సీ బాలికల హాస్టల్‌లో భూక్య రజిత అనే విద్యార్థిని సోమవారం రాత్రి నేయిల్‌పాలిష్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.

భీమదేవరపల్లి : మండలంలోని ముల్కనూర్‌ ఎస్సీ బాలికల హాస్టల్‌లో భూక్య రజిత అనే విద్యార్థిని సోమవారం రాత్రి నేయిల్‌పాలిష్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. హుస్నాబాద్‌ మండలం మైసమ్మవాగుతండాకు చెందిన రజిత ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమె తన గదిలో నేయిల్‌పాలిష్‌ తాగగా గమనించిన విద్యార్థులు మ్యాట్రిన్‌ ఉమకు తెలిపారు. ఆమె వెంటనే రజితను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. రజితకు ప్రాణపాయం లేదని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement