టిప్పర్ ఢీకొని విద్యార్థి మృతి | student killed in road accident | Sakshi
Sakshi News home page

టిప్పర్ ఢీకొని విద్యార్థి మృతి

Jul 28 2016 10:11 AM | Updated on Nov 9 2018 4:36 PM

టిప్పర్ రివర్స్ చేస్తు విద్యార్థిని ఢీకొట్టింది.

మెదక్ : వెనుక నుంచి వస్తున్న వాహనాలను గమనించకుండా టిప్పర్ రివర్స్ చేస్తున్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా వర్గల్ మండలం నెమ్టూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుతారి సురేష్(9) స్థానిక పాఠశాలలో నాలుగో తరగది చదువుతున్నాడు.

ఈ క్రమంలో ఇవాళ తండ్రితో కలిసి బైక్ పై వెళ్తున్నాడు. ఆ క్రమంలో రివర్స్‌లో వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్పై నుంచి  సురేష్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.  అలాగే సతీష్ (14), మహేశ్వరి (6) కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని  ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement