ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది బాధ్యతల స్వీకరణ | ssa staff on duties | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది బాధ్యతల స్వీకరణ

Jul 26 2017 10:49 PM | Updated on Jun 1 2018 8:39 PM

సర్వశిక్ష అభియాన్‌లో సెక్టోరియల్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ ఆఫీసర్లుగా నియామకమైన వారు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌: సర్వశిక్ష అభియాన్‌లో సెక్టోరియల్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ ఆఫీసర్లుగా నియామకమైన వారు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రొద్దం మండలం నారనాగేపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆనంద్‌బాబును కమ్యూనిటీ మొబలైజేషన్‌ ఆఫీసర్‌ (సీఎంఓ)గా నియమించారు. అలాగే రాప్తాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న నారాయణస్వామిని ఏపీఓగా, విడపనకల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఆనందభాస్కర్‌రెడ్డిని అసిస్టెంట్‌ అలెస్కోగా నియమించారు. వీరు ముగ్గురూ విధుల్లో చేరారు. ఐఈడీ కోఆర్డినేటర్‌గా నియామకమైన రామగిరి ఎంఈఓ రవినాయక్, అసిస్టెంట్‌ జీసీడీఓ కమలాక్షి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఇదిలా ఉండగా జీసీడీఓగా నియామకమైన లక్ష్మీశిరీష విధుల్లో చేరేందుకు అయిష్టత కనబరిచారు. ఈ మేరకు అధికారులకు రాతపూర్వకంగా ఆమె రాసి ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement