పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్లు | spot admissions in polytechnic | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్లు

Jul 25 2016 11:44 PM | Updated on Sep 18 2018 7:45 PM

దరఖాస్తులు పరిశీలిస్తున్న అధికారులు - Sakshi

దరఖాస్తులు పరిశీలిస్తున్న అధికారులు

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మిగులు సీట్లు ప్రవేశాలకు సోమవారం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించారు. ఖాళీ ఉన్న బ్రాంచ్‌లలో విద్యార్థుల ఆసక్తి మేరకు ప్రవేశాలు కల్పించారు.

ఎచ్చెర్ల: ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మిగులు సీట్లు ప్రవేశాలకు సోమవారం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించారు. ఖాళీ ఉన్న బ్రాంచ్‌లలో విద్యార్థుల ఆసక్తి మేరకు ప్రవేశాలు కల్పించారు. శ్రీకాకుళం పురుషుల, టñ క్కలి పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 82 సీట్లు ఖాళీలు ఉన్నాయి. వీటికి శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్‌ కళాశాలలో  కౌన్సెలింగ్‌ నిర్వహించగా 62 మంది హాజరయ్యారు. మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో 40 ఖాళీలకు 32 మంది హాజరయ్యారు. ప్రవేశాలు ప్రక్రియను ప్రిన్సిపాళ్లు త్రినాథరావు, సంధ్యారాణి, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి మురళీమోహన్‌లు పర్యవేక్షించారు. ప్ర వేశాలకోసం విద్యార్థులు నేరుగా కళాశాలను సంప్రదించ వచ్చని అధికారులు తెలిపారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement