ప్రత్యేక రైళ్ల పొడిగింపు | Special trains services extended in visakhapatnam and secunderabad | Sakshi
Sakshi News home page

ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Jan 19 2016 11:13 AM | Updated on Sep 3 2017 3:55 PM

ప్రత్యేక రైళ్ల పొడిగింపు

ప్రత్యేక రైళ్ల పొడిగింపు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే విశాఖ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్లకు నడుస్తున్న ప్రత్యేక వీక్లీ రైళ్లు అదనపు ట్రిప్పులను పొడిగిస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎల్వేందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.

విశాఖపట్నం : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే విశాఖ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్లకు నడుస్తున్న ప్రత్యేక వీక్లీ రైళ్లు అదనపు ట్రిప్పులను పొడిగిస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్  ఎల్వేందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
 
విశాఖపట్నం-తిరుపతి వీక్లీ ప్రత్యేక రైలు (08573) : ఫిబ్రవరి 1 నుంచి మార్చి 28 (సోమవారాలు) రాత్రి 10.55 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి ఆ మర్నాడు మధ్యాహ్నం 01.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
 
తిరుపతి-విశాఖపట్నం ప్రత్యేక వీక్లీ రైలు(08574) : ఫిబ్రవరి 2 మొదలు మార్చి 29 (మంగళవారాలు) తేదీల్లో  తిరుపతిలో మధ్యాహ్నం 03.30 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 06.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఒక సెకండ్‌క్లాస్ ఎ.సి, రెండు థర్డ్ ఎ.సి కోచ్‌లు, తొమ్మిది స్లీపర్ క్లాస్‌లు, ఆరు సెకండ్‌క్లాస్ సిట్టింగ్, రెండు సెకండ్ క్లాస్ కం లగే జ్ కోచ్‌లున్న ఈ జతరైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లమీదుగా రాకపోకలు సాగిస్తాయి.
 
విశాఖ నుంచి సికిందరాబాద్‌కు
విశాఖపట్నం-సికిందరాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్(08501) : ఫిబ్రవరి 2 మొదలు మార్చి 29 (మంగళవారాలు) తేదీల్లో విశాఖపట్నం నుంచి  రాత్రి 11 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు సికిందరాబాద్ చేరుకుంటుంది.

సికిందరాబాద్- విశాఖ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (08502) : ఫిబ్రవరి 3 మొదలు మార్చి 30వ తేదీల్లో (బుధవారాలు) సాయంత్రం 04.30 గంటలకు సికిందరాబాద్‌లో బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 06.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

ఒక సెకండ్‌క్లాస్ ఎ.సి, మూడు థర్డ్ ఎ.సి, పది స్లీపర్, ఆరు సెంకడ్‌క్లాస్ సిట్టింగ్ కోచ్, రెండు సెకండ్‌క్లాస్ సిట్టింగ్ కం లగేజ్ కోచ్‌లుండే ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగ ల్, కాజీపేట్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement