అమరావతి శంకుస్థాపనకు వచ్చే రైతులు, దేశ, విదేశీ ప్రతినిధులు, అతిథులకు చక్కటి ఆంధ్ర వంటకాలను సిద్ధం చేశారు.
హైదరాబాద్ : అమరావతి శంకుస్థాపనకు వచ్చే రైతులు, దేశ, విదేశీ ప్రతినిధులు, అతిథులకు చక్కటి ఆంధ్ర వంటకాలను సిద్ధం చేశారు. సాధారణ ప్రజలు, రైతులకు కలిపి దాదాపు లక్షన్నర మందికి వంటలు సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్యాకెట్‌లో ఆహారం అందజేస్తారు.
రైతులు ... సాధారణ ప్రజలకు...
చక్ర పొంగలి - 75 గ్రాములు
పులిహోర - 150 గ్రాములు, దద్దోజనం - 150 గ్రాములు, తాపేశ్వరం కాజా -1
అరటిపండు - 1, మంచినీళ్ల సీసాలు -2
వీఐపీలకు ....
చక్రపొంగలి - 100 గ్రాములు
పులిహోర - 150 గ్రాములు
గారె - 1 , పూర్ణం బూరె - 1
ఫ్రూటీ - 1, మంచినీళ్ల సీసా -1
వీవీఐపీలకు ...
వీరికి శంకుస్థాపన జరిగే ప్రాంతంలోనే టెంట్ ఏర్పాటు చేశారు. ఇందులో లెమన్ జ్యూస్, గ్రీన్‌సలాడ్, మొలకెత్తిన గింజలు, మొక్కజొన్న సలాడ్ ఉంచుతున్నారు. వీటితోపాటు భోజనంలోకి గోంగూర, కొత్త ఆవకాయ, రసం, వంకాయ పచ్చి పులుసు, కొబ్బరి చట్నీ, పచ్చి జామకాయ చట్నీ, కొబ్బరి శనగకారం, కరివేపాకు కారం, మెంతి మజ్జిగ, నేతి బొబ్బట్లు, జిలేబీ, అప్పడాలు, మూడు నాలుగు రకాల ఐస్ క్రీమ్‌లు, రకరకాల కిళ్లీలు ఉంచుతున్నారు. అంతేగాకుండా వీరికి వేదికపైనే పూర్ణం, డ్రైఫ్రూట్స్ కార్న్ సమోసా, ఫ్రూట్ జ్యూస్ అందజేస్తారు.